ETV Bharat / state

Penna River పెన్నానదికి భారీగా వరద - Gandikota Reservoir

Penna River Heavy Floods: పెన్నానదికి భారీగా వరదనీటి విడుదల కొనసాగుతోంది. వరద ఉధృతి వల్ల పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 9, 2022, 9:30 AM IST

Penna River Floods: పెన్నానదికి భారీగా వరదనీటి విడుదల కొనసాగుతోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు పెన్నా, చిత్రావతి నదుల ద్వారా వైయస్‌ఆర్‌ జిల్లా కొండాపురంలోని గండికోట జలాశయానికి నీళ్లు చేరుతున్నాయి. అక్కడి నుంచి మైలవరం డ్యామ్‌కు నీటిని మళ్లిస్తున్నారు. జమ్మలమడుగు-ముద్దనూరు మార్గమధ్యలో పెన్నా నదిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు బుధవారం అర్ధరాత్రి దాటాక వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. రెండుచోట్ల సుమారు 50 మీటర్ల మేర తెగిపోవడంతో 16 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లె- పెద్ద దండ్లూరు గ్రామాల మధ్యలో రహదారి కొట్టుకుపోవడంతో పెద్ద దండ్లూరు, సిరిగేపల్లె, సున్నపురాళ్లపల్లె, కన్యతీర్థం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరం నుంచి జమ్మలమడుగు వచ్చే దారిలో వేపరాలవద్ద మట్టి రోడ్డు తెగిపోయింది. గురువారం మైలవరం డ్యామ్‌ 9 గేట్ల ద్వారా 32,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు జలవనరుల శాఖ ఈఈ వెంకటరామయ్య తెలిపారు. మైలవరం డ్యామ్‌ సామర్థ్యం 6.5 టీఎంసీలు కాగా 5 టీఎంసీల నిల్వ ఉందన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు మైలవరం వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. గండికోట సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26 టీఎంసీల నిల్వ ఉందని డీఈ ఉమామహేశ్వరరావు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.