ETV Bharat / state

బ్రిడ్జి కుంగిపోయింది.... మరమ్మతులు చేపట్టరూ! - దెబ్బతిన్న గుంజన ఏరు వంతెన న్యూస్

2 గ్రామాల మధ్య రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన అది. ఇప్పుడు అది ఓ పక్కకు కుంగిపోయి ఉన్న కారణంగా.. ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు.

bridge damage at railway koduru
దెబ్బతిన్న గుంజన ఏరు వంతెన
author img

By

Published : May 13, 2020, 6:37 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణ సమీపంలో రెడ్డివారి పల్లి, చియ్యవరం గ్రామాల పరిధిలో.. ప్రధాన రహదారి అయిన గుంజన ఏరు వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. సైడ్ బ్రిడ్జ్ పగిలిపోయిన కారణంగా.. వంతెన ఓ పక్క కుంగిపోయింది. వాహనదారులు ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే భయాందోళనలకు గురువుతున్నారు.

గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రైతులు పండించిన పంటను మార్కెట్​కు ఈ వంతెనపై నుంచే తరలిస్తుంటారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతు పనులు చేపట్టాలని ఆ రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

'అధైర్యం వద్దు.. ప్రభుత్వం పంటను కొంటుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.