కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని మామిళ్లపల్లె సమీపంలో ముగ్గురాళ్ల గనుల వద్ద భారీ పేలుడు జరిగిన ప్రదేశాన్ని గురువారం విశాఖపట్నం నుంచి వచ్చిన ఎక్స్‌ఫ్లోజివ్స్ డైరెక్టరు సర్కార్ పరిశీలించారు. పేలుడు ధాటికి ముక్కలైన కారుతో పాటు చుట్టు పక్కల ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనంలో జిలెటెన్ స్ట్రిక్స్, డిటోనేటర్లు రెండు కలిపి తేవడం వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి నుంచి పలు వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఎస్‌బీ కానిస్టేబుల్ రమేష్ పాల్గొన్నారు. ఈ నెల 8న మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాళ్ల గనుల వద్ద భారీ పేలుడు జరిగి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుంచి పేలుడు పదార్థాలు తేవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురాళ్ల గనులకు పర్యావరణ అనుమతులు లేకున్నా పనులు జరిగినట్లు అధికారులు పేర్కొన్న విషయం విదితమే.
ఇదీ చదవండీ… అంబులెన్స్‌లను హైదరాబాద్ తరలించే ప్రయత్నాల్లో ఉన్నాం : ఎమ్మెల్యే హఫీజ్