ETV Bharat / state

College Locked: ఇంజినీరింగ్ కళాశాలలో వైసీపీ నేతలు హల్‌చల్.. భయాందోళనలో విద్యార్థులు

author img

By

Published : Apr 21, 2023, 3:26 PM IST

Global Engineering College Locked: గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు హల్‌చల్ చేశారు. కాలేజీని వారి ఆధీనంలోకి తీసుకుని.. హాస్ట‌ల్ విద్యార్ధులు లోపల ఉండ‌గానే, సెక్యూరిటీని, ఇత‌ర సిబ్బందిని బ‌య‌ట‌కు పంపి తాళాలు వేశారు. దీంతో హాస్టల్లోనే ఉండిపోయిన విద్యార్థులు ఏం జరుగుతుందో అర్థంకాక ఒక్కసారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

YSRCP
YSRCP

Global Engineering College Locked: కడప నగర శివారులోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల గేటుకు తాళాలు వేసి, కొందరు వ్యక్తులు హల్‌చల్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు వీరా రెడ్డికి కళాశాల యాజమాన్యంతో ఉన్న స్థల వివాదాల కారణంగా.. కళాశాల గేటుకు తాళాలు వేసి, విద్యార్థులను భయాందోళనకు గురిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని.. గేటు తాళాలను పగలగొట్టి.. విద్యార్థులను తరగతి గదులకు పంపించారు. వైఎస్సార్సీపీ నాయకుడు వీరా రెడ్డితో స్థల వివాదంలో పంచాయితీలు జరిగినా.. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కళాశాల ప్రిన్సిపల్ ఆరోపించారు. తమ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

కడప ఇంజినీరింగ్ కళాశాలలో వైసీపీ నేతలు హల్‌చల్

వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వీరా రెడ్డి అనుచరులు క‌డ‌ప న‌గ‌ర శివారులో ఉన్న గ్లోబ‌ల్ ఇంజినీరింగ్ కళాశాలలో వీరంగం సృష్టించారు. ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి సోదరుడు వీరా రెడ్డి భూముల విషయంలో కళాశాల యాజమాన్యంతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో కొంద‌రు వైఎస్సార్సీపీకి చెందిన వ్య‌క్తులు దౌర్జ‌న్యంగా కళాశాలను వారి ఆధీనంలోకి తీసుకుని.. హాస్ట‌ల్ విద్యార్ధులు లోపల ఉండ‌గానే, సెక్యూరిటీని, ఇత‌ర సిబ్బందిని బ‌య‌ట‌కు పంపి తాళాలు వేశారు. దీంతో హాస్టల్ విద్యార్థులు ఒక్కసారిగా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.

అనంతరం కాలేజీకి విద్యార్ధులు రాకుండా గేట్లు వేయ‌డంతో వంద‌లాది మంది విద్యార్ధులు బ‌య‌టే ఉండిపోయారు. కళాశాల యాజ‌మాన్యంతో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునే క్ర‌మంలో హ‌స్టల్ విద్యార్థులను నిర్భంధించే విధంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో లోప‌ల ఉన్న విద్యార్ధులు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాల యాజ‌మాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

కళాశాలను కొంద‌రు వారి ఆధీనంలోకి తీసుకుని హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో కళాశాలకు విచ్చేసిన విద్యార్థులు, లోప‌ల ఉన్న విద్యార్థులు ఏం జరుగుతుందో అర్థంకాక భ‌యాందోళ‌న‌కు గురయ్యారు. తమ కాలేజీలో రౌడీలు ఉన్నార‌ని, త‌మ విద్యార్థుల ప‌ట్ల వారు దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన‌ట్లు కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పారు. కాలేజీ వ‌ద్ద ప‌రిస్థితి చేయి దాట‌డంతో పోలీసులు అక్క‌డికి చేరుకుని, బ‌య‌ట వ్య‌క్తులు వేసిన తాళాల‌ను ప‌గుల‌గొట్టి.. విద్యార్థులను తరగతి గదుల్లోకి పంపించారు. అయితే, కాలేజీ యాజ‌మాన్యం ఫిర్యాదు ఇస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెన్నూరు పోలీసులు తెలిపారు. పోలీసుల స‌మ‌క్షంలో ఈ స్థ‌లం పంచాయితీ జ‌రిగినా, ఇవ్వాల్సిన డ‌బ్బులు ఇవ్వ‌క‌పోగా దౌర్జ‌న్యంగా కాలేజీని ఆక్ర‌మించుకుని.. విద్యార్థులను భ‌య‌పెడుతున్నార‌ని ప్రిన్సిపాల్ ఆరోపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు కళాశాలలో జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, కళాశాల యాజమాన్యం అధికారులను వేడుకున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.