కడప జిల్లా కోడికాండ్ల పల్లెని గండికోట జలాలు చుట్టుముడుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. జలాశయంలో 26 టీఎంసీలకు ప్రభుత్వం అనుమతివ్వగా.. 23 టీఎంసీలకే గ్రామం ముంపునకు గురౌతోందని వాపోతున్నారు. పంట పొలాలు సైతం మునిగిపోతున్నాయని, తాగే నీళ్లు కూడా కలుషితమయ్యాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్పించి పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: నీరు కూడా వినియోగవనరుగా మారింది: భిక్షం గుజ్జ