ETV Bharat / state

గాలేరు-నగరి సుజల స్రవంతి పనులకు శంకుస్థాపన - గాలేరు నగరి పనులకు శంకుస్థాపన

గాలేరు నగరి సుజల స్రవంతి పనులకు కడప ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలేరు-నగరి రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి 150 కోట్ల రూపాయలు ఆదా అయ్యిందని తెలిపారు.

starting stone
గాలేరు-నగరి సుజల స్రవంతి పనులకు శంకుస్థాపన
author img

By

Published : Jul 29, 2020, 7:00 PM IST

గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్​ఎస్ఎస్) పనులకు కడప ఎంపీ అవినాష్​రెడ్డి శంకుస్థాపన చేశారు. 497.20 కోట్ల రూపాయలు ఈ పనులకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మిగిలిపోయిన ప్యాకేజీ 1,2,3,4, రాజోలి ఆనకట్ట పనులు శరవేగంగా పూర్తి చేస్తామని అన్నారు.

పనులు మెుదలైతే... రెండు సంవత్సరాలలోపు పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గాలేరు-నగరి పనులకు రివర్స్ టెండరింగ్​ ద్వారా 1,2 ప్యాకేజీలలో దాదాపు 150 కోట్ల రూపాయలు ఆదా అయ్యిందన్నారు. రెండవ ప్యాకేజీ పనులు వెయ్యి నూతల కోన వద్ద రేపు ప్రారంభించనున్నట్లు ఎంపీ వెల్లడించారు.

ఇదీ చదవండి:తమ్ముడి హత్య కేసులో సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.