ETV Bharat / state

Viveka Murder Case: వివేక హత్యకు సంబంధించిన సమాచారం ఉదయకుమార్ రెడ్డికి ముందే తెలుసు:సీబీఐ - Udaykumar Reddy role in YS Viveka murder case

Uday Kumar Role in the Viveka Murder Case: సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషిట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకానందరెడ్డి హత్య కుట్ర గురించి నిందితుడు గజ్జల ఉదయకుమార్‌రెడ్డికి ముందే తెలుసని సీబీఐ వెల్లడించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున తల్లికి ఇదే విషయాన్ని చెప్పి బయటికి వచ్చారని ఉదయ్‌కుమార్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.

Viveka murder case
వివేకా హత్య కుట్ర కేసు
author img

By

Published : Apr 16, 2023, 9:10 AM IST

Updated : Apr 16, 2023, 11:52 AM IST

Uday Kumar Role in the Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కుట్ర గురించి నిందితుడు గజ్జల ఉదయకుమార్‌రెడ్డికి ముందే తెలుసని సీబీఐ వెల్లడించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున తల్లికి ఇదే విషయాన్ని చెప్పి బయటికి వచ్చినట్లు పేర్కొంది. తర్వాత పులివెందులలో అటూఇటూ తిరిగి ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లారని తెలిపింది. ఉదయం 6.25కు అవినాష్‌రెడ్డి ఇంట్లోను, 6.27కు వివేకానందరెడ్డి ఇంటి బయట, 6.29 నుంచి 6.31 మధ్య వివేకా ఇంట్లో ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా ఫోరెన్సిక్‌ పరిశీలనలో తేలిందని చెప్పింది. ఘటనా స్థలంలో సాక్ష్యాలను తుడిచేయడంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డి, గంగిరెడ్డి, ఇతర నిందితులతో కలిసి ఉదయ్‌కుమార్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది.

ఈ హత్య కేసులో అరెస్ట్‌ చేసిన ఉదయ్‌కుమార్‌రెడ్డిని కస్టడీకి కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. పలుమార్లు విచారించినా దర్యాప్తునకు సహకరించడం లేదని, తెలిసిన వాస్తవాల గురించి చెప్పకుండా మాట మార్చుతూ, సమాధానాలను దాటవేస్తున్నారని, కుట్రపై దర్యాప్తు కొనసాగించడానికి 10 రోజుల కస్టడీ అవసరమని తెలిపింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి తదితరులు ఈ కుట్రలో భాగస్వాములని దర్యాప్తులో తేలిసిందని సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లో చెప్పింది. దాని సారాంశమిదీ.

  • కుట్రకు సహకారం.. ఆధారాల ధ్వంసంలో కీలకపాత్ర

2019 మార్చి 15న వివేకానందరెడ్డి చనిపోయారని తల్లికి చెప్పి ఉదయ్‌కుమార్‌రెడ్డి బయటికి వెళ్లిపోయారు. వివేకా చనిపోయినట్లు తెల్లవారుజామున 4 గంటలకే ఉదయ్‌కుమార్‌రెడ్డికి తెలుసని ఆయన తల్లి శకుంతల చెప్పినట్లు పొరుగింటిలోని టి.ప్రభావతి చెప్పారు. 2019 మార్చి 15 ఉదయం 3.35 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లి 4.01 గంటల వరకూ పులివెందులలో అటు ఇటూ తిరిగారు. అప్పటికి వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నకు, కుట్రలో పాల్గొన్న నిందితులకు తప్ప బయటి వ్యక్తులకు ఎవరికీ వివేకా హత్య గురించి తెలియదు.

వాచ్‌మెన్ రంగన్న కూడా బయటి వ్యక్తులకు ఎవరికీ చెప్పలేదు. హత్య కుట్రకు సహకరించడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో ఉదయ్‌కుమార్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. 15వ తేదీన ఉదయం ఉదయ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తదితరులు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. ఇతరుల నుంచి ఏదైనా సమాచారం వస్తే వెంటనే వెళ్లి ఆ సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు అక్కడ ఉన్నట్లు తేలింది. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలతో మాట్లాడానని మొత్తం వ్యవహారాలన్నీ వాళ్లు చూసుకుంటారని.. గంగిరెడ్డి ఇతర నిందితులకు చెప్పి వారితోపాటు వివేకా ఇంటికి వెళ్లినట్లు తేలింది.

  • అవినాష్‌, భాస్కరరెడ్డి సూచనలతో వివేకాకు బ్యాండేజ్‌

వివేకా చనిపోయినట్లు అవినాష్‌రెడ్డికి ఉదయం 6.26కు ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేసి చెప్పారు. అనంతరం ఉదయ్‌కుమార్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఈసీ సురేందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు వివేకా ఇంటికి వెళ్లారు. తలపై గాయాలతో బాత్‌రూంలో రక్తపు మడుగులో ఉన్న వివేకాను చూశారు. తరువాత అవినాష్‌రెడ్డి తన వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి ఫోన్‌తో.. సీఐ శంకరయ్యకు ఫోన్ చేసి.. వివేకా గుండెపోటుతో రక్తపు వాంతులు చేసుకుని చనిపోయినట్లు తెలిపారు. భద్రత కోసం ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లను పంపాలనీ చెప్పారు.

అవినాష్‌రెడ్డి.. వివేకా మృతదేహాన్ని చూసిన తరువాత శివశంకర్‌రెడ్డితో మాట్లాడి.. పోలీసులను పిలిచినట్లు తేలింది. దీన్నిబట్టి కుట్రను దాచిపెట్టి సహజ మరణమని నమ్మించడానికి కట్టుకథ అల్లినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలోకి కొంతమంది వెళ్లి ఆధారాలను ధ్వంసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. బెడ్‌రూం లోపలి నుంచి గడియ పెట్టినట్లు కొందరు గమనించారు. ఘటనా స్థలంలో వివేకా మృతదేహాన్ని చూసినవారు ఇది గుండెపోటు కాదని, హత్య జరిగిందేమోనని అనుమానించారు. బాత్‌రూం, బెడ్‌రూమ్‌లలో ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసిన తరువాత మృతదేహాన్ని బెడ్‌రూంలోకి తీసుకువచ్చారు.

ఈలోగా ఉదయ్‌కుమార్‌రెడ్డి కాటన్‌, బ్యాండేజ్‌ సిద్ధం చేసి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న తన తండ్రి గజ్జల జయప్రకాశ్‌రెడ్డిని వివేకా ఇంటికి పిలిపించారు. శివశంకర్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కరరెడ్డి, ఎర్రగంగిరెడ్డిల సూచనల మేరకు జయప్రకాశ్‌రెడ్డి.. వివేకా మృతదేహానికి కట్టుకట్టి గాయాలను కప్పిపెట్టినట్లు తేలింది. హత్యను కప్పిపుచ్చేందుకు గుండెపోటు కథనాన్ని అల్లారని, గాయాలను కప్పిపెట్టారని, మృతదేహాన్ని ఫ్రీజర్‌ బాక్స్‌ను తెప్పించి అందులో ఉంచి ప్రజల సందర్శనార్థం పూలతో అలంకరించి పెట్టారని తెలిపింది. ఇది గుండెపోటు సంఘటనగానే చెప్పాలని సీఐని నిందితులు బెదిరించినట్లు తేలింది.

గుండెపోటుతోనే చనిపోయినట్లు సందర్శకులకు నిందితులు చెప్పారు. కీలక సాక్షులను ప్రభావితం చేయడానికి ఉదయ్‌కుమార్‌ ప్రయత్నించారు. దర్యాప్తులో భాగంగా ఉదయ్‌కుమార్‌రెడ్డిని పలుమార్లు విచారించాం. దర్యాప్తునకు ఆయన సహకరించలేదు. సమాధానాలు దాటవేశారు. వాస్తవాలు చెప్పకుండా పరస్పర విరుద్ధంగా మాట్లాడారు’ అని కస్టడీ నివేదికలో సీబీఐ తెలిపింది. తదుపరి దర్యాప్తును కొనసాగించి, వివేకా హత్య వెనుక కుట్రను బయటపెట్టడానికి ఉదయ్‌కుమార్‌రెడ్డిని 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఈ పిటిషన్‌పై సోమవారం (17న) సీబీఐ కోర్టు విచారణ జరగనుంది.

  • వివేకా హత్య కేసులో పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తన భర్తను అన్యాయంగా ఇరికించే యత్నం చేస్తున్నారని, ఈ కేసులో తాను అనుమానిస్తున్న కొందరు వ్యక్తులను విచారించాలంటూ నిందితుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి భార్య తులశమ్మ గతేడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ మేరకు సాక్ష్యం నమోదు చేయడానికి చేపట్టిన విచారణకు శనివారం సాక్షులు న్యాయస్థానానికి రాలేదు. దీంతో విచారణను మే 6వ తేదీకి వాయిదా వేశారు.

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తప్పుదోవ పడుతోందని, ఈ కేసులో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్‌ రవి), వైజీ రాజేశ్వర్‌రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, వివేకా రెండో వివాహం చేసుకున్నారని, రెండో భార్యకు, వారికి పుట్టిన కుమారుడికి ఆస్తి పంచిపెడతారనే ఉద్దేశంతో ఈ హత్య చేయించి ఉంటారనే కోణంలో అనుమానితులపై విచారణ చేపట్టాలని తులశమ్మ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. మార్చి 25న వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి సాక్ష్యాన్ని న్యాయస్థానం నమోదు చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 16, 2023, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.