నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కడప జిల్లాలో ప్రారంభమైంది. ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జమ్మలమడుగు డివిజనల్ పంచాయతీ అధికారిణి శివ కుమారి తెలిపారు. ఈనెల 12 వరకు నామపత్రాల స్వీకరణ కొనసాగనుండగా.. మొదటి రోజు నామినేషన్లు మందకొడిగా దాఖలయ్యాయి.
జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లోని 224 గ్రామపంచాయతీలకు.. 99 క్లస్టర్ కేంద్రాల్లో తుది దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 10.30 గంటల నుంచి ఈనెల 12న సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామపత్రాలు స్వీకరిస్తారు. నామినేషన్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: