red sanders smugglers arrested: ఎర్రచందనం చెట్లను నరికి మొద్దులుగా మార్చారు. అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న కడప జిల్లాలోని కాశినాయన పోలీసులు.. రంగంలోకి దిగారు. నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేసి.. 20 దుంగులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని కడపలోని ఎస్పీ అన్బురాజన్ కార్యాలయంలో మీడియా ఎదుటు ప్రవేశపెట్టారు. వీరికి సంబంధించిన వివరాలను ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఉమా శంకర్, రమణయ్య, వసంత కుమార్, వేరే రాష్ట్రానికి చెందిన సుబ్రమణ్యం అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాశి నాయన మండలం సమీపంలోని ఎర్రచందనం అడవుల్లో చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. ఇందులో నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 20 ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి
ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ.. సీఎం సమక్షంలో నిర్ణయాలు వెల్లడి!