కడప జిల్లా పొద్దుటూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెడినోవా ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ దగ్ధమైంది. అంబులెన్స్‌కు ఎల్పీజీ గ్యాస్‌ను ఎక్కిస్తుండగా లీకేజీ కావడంతో ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి అంబులెన్స్ వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ప్రమాద స్థల సమీపంలో పాఠశాల, కళాశాల ఉన్నాయి. విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరికి ఎలాంటి అపాయం జరక్కపోవడతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.
ఇదీ చదవండి: