కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజువ్వి వద్ద గొర్రెల మందపై ట్యాంకర్ దూసుకెళ్లింది.ఈ ఘటనలో 15 గొర్రెలు మృతి చెందాయి. ముద్దనురు మండలం సోంపల్లికు చెందిన కుడాలయ్య.. తెల్లవారుజామున గొర్రెల మందను తీసుకోని సోంపల్లికి వెళ్తున్నాడు. అదే సమయంలో చెన్నై వెళ్తున్న ఓ ట్యాంకర్ గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 గొర్రెలు మృతి చెందాయి. వాటి విలువ లక్షా 50 వేల రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. పోలీసులు ట్యాంకర్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: mp raghurama: అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఎంపీ రఘురామ లేఖ