కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణ పాపయ్య పల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే రైతు.. తనకున్న రెండెకరాల పొలంలో పంటను సాగు చేసుకునేందుకు అవసరమైన పెట్టుబడి కోసం అప్పులు చేశాడు.
పంటకు నీరు అందించడానికి భూగర్భజలాలు అడుగంటడంతో 2 బోర్లను వేశాడు. కరోనా కారణంగా పనులు లేక అప్పులు ఎలా తిరిగి చెల్లించాలో అర్థం కాక.. ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు తెలిపారు. పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు.
ఇదివరకే రైతు రాఘవేంద్ర భార్య మృతి చెందింది. ఇద్దరు పిల్లలను తానే చూసుకునే వాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: