Former mla Veera Siva Reddy News: వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి.. హైదరాబాద్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. గత పదేళ్ల నుంచి కమలాపురం నియోజకవర్గంలో ఏ పార్టీలోనూ చురుగ్గా పాల్గొనకుండా(స్తబ్ధుగా) ఉన్న వీరశివారెడ్డి.. ఇపుడు తెదేపాలో చేరడానికి మార్గం సుగుమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇవాళ లోకేశ్‌ను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.
1994, 2004లో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి కమలాపురం ఎమ్మెల్యేగా గెలిచిన వీరశివారెడ్డి.. 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఇక 2014 నుంచి టికెట్ రాకపోవడంతో ఏ పార్టీలోనూ చురుగ్గా పాల్గొనకుండా ఉన్నారు. తాజాగా నారా లోకేశ్‌ను వీరశివారెడ్డి కలవడం చర్చనీయాంశమైంది. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి ఈసారి టికెట్ ఇచ్చేది లేదని మహానాడు సందర్భంగా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌తో వీరశివారెడ్డి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కమలాపురం నుంచి తెదేపా తరపున వరుసగా మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన పుత్తా నరసింహారెడ్డి స్థానంలో తనకు టికెట్ వస్తుందనే ఆశతో వీరశివారెడ్డి లోకేశ్‌ను కలిసినట్లు సమాచారం. అయితే.. చంద్రబాబును కలిసిన తరువాత తెదేపాలో చేరతానని వీరశివారెడ్డి ప్రకటించారు.
ఇదీ చదవండి: