కడప జిల్లా బి. కోడూరు మండలం గుంతపల్లి గ్రామంలో ఘోరం జరిగింది. పొలానికి వెళ్ళి ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గురివిరెడ్డి రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఉదయాన్నే మడవ కట్టేందుకు పొలం వద్దకు వెళ్లారు. మడవ కడుతున్న సమయంలో విద్యుత్ తీగలు కాలికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యవసాయ బోరు కోసం కట్టెలు పెట్టి లాగిన విద్యుత్ తీగలు.. కిందకు పడిపోయిన కారణంగా.. అధికారులకు సరిచేయాలని ఎప్పుడో దరఖాస్తు చేశాడు. కానీ ఆ శాఖ అధికారులు పట్టించుకోలేదని బాధిత కుటుంబీకులు వాపోతున్నారు. ఇంటికి ఆధారంగా ఉన్న పెద్దదిక్కు కోల్పోయాడని భార్య, పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. రైతు మృతి చెందిన విషయం తెలియగానే బి.కోడూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసురకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: