మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి... ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ నెల 23న కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేసేందుకు సీఎం జగన్ వస్తున్నారు. అయితే దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసినచోటే తనయుడు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తుండటం శుభసూచకమని చెప్పడం కొన్ని ఊహాగానాలకు తావిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటైతే జిల్లా దశ మారిపోతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత... ఈ సమయంలో ముఖ్యమంత్రిని పొగడ్తల్లో ముంచెత్తడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపాలోకి అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి :