రాజకీయాల్లో ఉన్నంత వరకు వైకాపాను వీడేది లేదని మాజీమంత్రి, వైకాపా నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి కార్యక్రమాలకు పిలుపులు రావడం లేదన్న విషయం వాస్తవమేనన్నారు.
కొత్తగా పార్టీలో చేరడంతో ఇలాంటి సమస్యలు వస్తుంటాయని.. త్వరలో అన్నీ సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నిటికీ సిద్ధపడే తెదేపా నుంచి వచ్చానని వెల్లడించారు. ఈ విషయంపై ఎటువంటి పునరాలోచన లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: