వైఎస్ వివేకా హత్యకేసు నిందితులను ఉరి తీయాలని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేయాలన్నారు. తనపైనా కొందరు ఆరోపణలు చేశారని.. తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి వివేకా కుమార్తెకే రక్షణ లేదన్న ఆదినారాయణ.. ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి జగన్ను ప్రశ్నించారు. సొంత చెల్లెలు షర్మిల రాజకీయా వాటా అడిగిన కారణంతోనే ఆమెను ముఖ్యమంత్రి జగన్ దూరం పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకమైన పాలన కొనసాగుతోందని.. రాష్ట్ర ప్రజలు స్వాతంత్య్రాన్ని కోల్పోయారని విమర్శించారు.
ఇదీ చదవండి:
viveka murder case: వివేకా కేసు.. అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు