కడప ఉక్కు కర్మాగార పర్యావరణ అనుమతుల కోసం ఏపీ పంపిన దరఖాస్తును ఈనెల 10న జరిగే ఎన్విరాన్‌మెంట్ అసెస్‌మెంట్ కమిటీ సమావేశంలో పరిశీలించనున్నట్లు..కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. గతంలో పంపిన ప్రతిపాదనను సాంకేతిక లోపాల కారణంగా తిప్పిపంపగా..ప్రాజెక్టు నిర్మాణదారు గత నెల 29న మరోసారి ప్రతిపాదన పంపినట్లు ప్రకాశ్ జావడేకర్ లోకసభకు తెలిపారు. వైకాపా సభ్యుడు అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
కడప జిల్లా జమ్మలమడుగులో 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించతలపెట్టిన సమీకృత ఉక్కు కర్మాగారంపై గతేడాది నవంబర్‌లో ప్రజలతో సంప్రదించిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం డిసెంబరులో దరఖాస్తు సమర్పించినట్లు ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో జరిగిన సమావేశంలో ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ పరిశీలన చేసి..సాంకేతిక లోపాలు గుర్తించి వాటిని సరిదిద్దాలని ప్రాజెక్టు ప్రతిపాదనకు పంపినట్లు పేర్కొన్నారు.
ఇదీచదవండి