కడప జిల్లా బద్వేలు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో.. వైకాపా అభ్యర్థి సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని..చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గోపవరం మండలం రాచాయిపేట గ్రామంలో జరిగిన సమావేశంలో రోజా పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అమ్మ ఒడి, జగనన్న కానుక, ప్రభుత్వ పథకాలను పేదలకు అందించి అండగా నిలిచారన్నారు.
వైకాపాకు ఓటు వేస్తే.. అరాచకాలను ప్రోత్సహించినట్లే
బద్వేలు ఉపఎన్నికల్లో వైకాపాకు ఓటు వేస్తే.. అరాచకాలను ప్రోత్సహించినట్లేనని.. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. కమ్మవారిపల్లె గ్రామంలో పురందేశ్వరి సహా పలువురు భాజపా నేతలు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి కేంద్ర నిధులు అందిస్తుందని తెలిపారు.రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు, అక్రమాలే తప్ప అభివృద్ధి శూన్యం అన్న పురందేశ్వరి.. బెదిరింపులు, భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని వైకాపా భావిస్తోందని ఆరోపించారు. అవీనీతిపరులైన వైకాపా ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని.. కేంద్ర బలగాలతోనే ఎన్నికలు జరుగుతాయని..బద్వేల్ ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.
బెదిరించి, లోబర్చుకున్నారు..
కలసపాడకు చెందిన తమ పార్టీ మండల అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డిని బెదిరించి వైకాపాలో చేర్చుకున్నారని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ విషయమై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్నికల కమిషన్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. మండలాధ్యక్షుడిని బెదిరించి, లోబర్చుకున్న వైకాపాకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని సోము వీర్రాజు కోరారు.
వైకాపా, భాజపాలను ఓడించాలి..
బద్వేలు ఉపఎన్నికలో వైకాపా, భాజపాలను ఓడించాలని.. కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
High Court: సీఎస్, డీజీపీకి హైకోర్టు నోటీసులు.. మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు ఎలా ఇస్తారు?