కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీరోడ్డులోని క్లాసిక్ టైలర్ దుకాణానికి సంబంధించిన వర్క్‌షాపులో విద్యుదాఘాతం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఘటనలో 25 కుట్టు యంత్రాలు, కుట్టేందుకు కత్తిరంచిన సుమారు వంద జతల బట్టలు కాలిపోయినట్లు బాధితుడు షబ్బీర్ చెప్పారు. భవనం దెబ్బతినడమే కాక.. సుమారు 10 లక్షల మేర నష్టం జరిగిందని ఆవేదన చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి: