ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ పిలుపు మేరకు.. కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఉదయం నుంచే ఇళ్లకు పరిమితమయ్యారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు మూసివేశారు. బస్సులు ఆర్టీసీ బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. రెండు రోజులుగా బంద్ గురించి ప్రచారం జరగడంతో ప్రజలు ప్రయాణాలన్నింటిని వాయిదా వేసుకున్నారు. మునిసిపాలిటీ అధికారులు సిబ్బందిచే పట్టణంలో బ్లీచింగ్ పౌడర్, పిచికారి మందులు చల్లుతూ రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో జనతా కర్ఫ్యూ.. రహదారులు నిర్మానుష్యం