కడప జిల్లా బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామ సచివాలయం శంకుస్థాపన సందర్భంగా వైకాపా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వైకాపా నాయకులు రామకృష్ణారెడ్డి డి.యోగానంద్ రెడ్డితో పాటు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణలో గాయపడిన వారంతా బద్వేల్ పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ పోరుమామిళ్ల చేరుకుని వైకాపాలో ఇరువర్గాలకు ఘర్షణకు దారి తీసిన అంశాలకు సంబంధించి వివరాలు ఆరా తీశారు. పాయలకుంట గ్రామ సచివాలయం శంకుస్థాపనకు బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య యోగానంద రెడ్డితో కలిసి వెళ్లారు. ఈ వ్యవహారంలో రామకృష్ణారెడ్డి తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని వాదనకు దిగారు. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం వద్దు.. తర్వాత చేసుకోమని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటకు మాట పెరిగి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు నలుగురే ఉండడంతో ఘర్షణ అదుపు చేయలేకపోయారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని బద్వేల్, పోరుమామిళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.
వైకాపా ఇరు వర్గాల ఘర్షణలో 12 మందిపై కేసు నమోదు - గ్రామ సచివాలయం శంకుస్థాపన గొడవ
బి. కోడూరు మండలం పాయలకుంటలో గ్రామ సచివాలయం శంకుస్థాపన వ్యవహారంలో జరిగిన ఘర్షణపై మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్ ఆరా తీశారు. ఈ ఘటనలో 12 మందిపై కేసు నమోదు చేశారు.