కడప జిల్లా రాజంపేట ఆస్పత్రికి ఎన్ఆర్ఐ రజినేష్ 90 పీపీఈ కిట్లను అందజేశారు. అమెరికాలో నివాసం ఉండే రజినేష్.. కొవిడ్ బాధితుల కోసం నిధులు సమకూర్చి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అనంతరం వీటిని ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవ్కుమార్ రెడ్డికి అందజేశారు. త్వరలోనే 10 కాన్సంట్రేటర్లను సమకూర్చుతామని ఆయన పేర్కొన్నారు.
10 బెడ్లు ఏర్పాటు..
కరోనా రోగుల కోసం కొవిడ్ వార్డుకు 10 పడకలను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. అందులో ఐదు బెడ్లకు ఆక్సిజన్ సిలిండర్ సదుపాయం ఉన్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్ బాధితులు ఆస్పత్రిలోనికి వచ్చేందుకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండీ.. ఆగని రెమ్‌డెసివిర్ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు