ETV Bharat / state

ARREST: నకిలీ చలానాల కేసులో ముగ్గురు డాక్యుమెంట్​ రైటర్లు అరెస్ట్ - ap taza varthalu

document
document
author img

By

Published : Aug 20, 2021, 11:36 AM IST

Updated : Aug 21, 2021, 2:34 AM IST

11:34 August 20

సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్ల అరెస్టు

నకిలీ చలానాల కుంభకోణం తొలుత వెలుగుచూసిన కడప జిల్లాలో ముగ్గురు బాధ్యులను పోలీసులు అరెస్టు చేశారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రైటర్స్‌గా పనిచేసిన వ్యక్తులే ప్రభుత్వాదాయానికి గండి కొట్టారని పోలీసులు తేల్చారు. కేవలం 8 నెలల్లోనే కోటి రూపాయలకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని... ప్రతి రూపాయీ ప్రభుత్వానికి తిరిగి చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. 

   గడచిన కొద్దిరోజులుగా రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖలో నకిలీ చలానాల బాగోతం బయటపడుతోంది. తొలుత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది సీఎం జగన్‌ సొంత జిల్లాలోనే. ఈ నెల 4న దీనిపై కేసు నమోదైంది. కడప పట్టణ, గ్రామీణ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రైటర్స్‌గా పనిచేస్తున్న వ్యక్తులే నకిలీ చలానాలు సృష్టించి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేస్తున్నారని తేల్చారు. శుక్రవారం ముగ్గురు డాక్యుమెంట్‌ రైటర్లు జింకా రామకృష్ణ, లక్ష్మీనారాయణ, గురుప్రకాశ్‌లను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

 భూముల రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వచ్చే వ్యక్తులకు మధ్యవర్తులుగా వ్యవహరించే నెపంతో.. రైటర్లు నకిలీ చలానాలు సృష్టించారని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. దాదాపు 8 నెలల్లోనే 789 నకిలీ చలానాలు సృష్టించి 241 రిజిస్ట్రేషన్లు చేయించినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ చలానాలా ద్వారా వీరికి కోటి రూపాయల దాకా ఆదాయంరాగా... నిందితులు ముగ్గురూ ఆస్తులూ కొనుగోలు చేసినట్లు తేల్చారు. వీరి వద్ద నుంచి డబ్బును స్వాధీనం చేసుకుని తిరిగి ప్రభుత్వానికి అప్పగించే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. నకిలీ చలానాల వెనుక ఎవరెవరున్నారే దానిపై విచారణ చేపడుతున్నామని... అధికారులెవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతుందని పోలీసులు వెల్లడించారు. 

ఇదీ చూడండి:

Afghanistan Hero: ఆయనంటే తాలిబన్ల వెన్నులో వణుకు..!

రూ.70 వేల కోట్ల నిధి తాలిబన్లకు దక్కనిది అందుకే..!

Last Updated : Aug 21, 2021, 2:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.