కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని వైద్యులు, న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో తహసీల్దారును కలిసి విన్నవించారు. ప్రొద్దుటూరు అన్ని విధాలుగా అభివృద్ది చెందుతోందని.. తప్పనిసరిగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పట్టణలంలో ఉన్న జిల్లా ఆసుపత్రిని బోధనా ఆసుపత్రిగా మార్చాలని ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి...