జిల్లాకు 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వితరణ చేసిన.. మిడ్ వెస్ట్ గ్రానైట్ మైనింగ్ కంపెనీ (ప్రకాశం జిల్లా)కి.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అభినందనలు తెలిపారు. కలెక్టర్ చాంబర్లో కంపెనీ ప్రతినిధులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను అందజేశారు. మొదటివిడతగా 25 కాన్సంట్రేటర్లను అందించారు.
అడిగిన వెంటనే.. సహాయం చేసిన మిడ్ వెస్ట్ మైనింగ్ కంపెనీ చైర్మన్ రాఘవరెడ్డికి ప్రత్యేక అభినందనలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు. మరో 5 రోజుల్లో మిగతా 75 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను జిల్లాకు రానున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: