ETV Bharat / state

'కడపను కరోనా రహితంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి'

author img

By

Published : May 6, 2020, 9:06 PM IST

కరోనా రహిత పట్టణంగా కడపను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని... ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కోరారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 8 నుంచి 17వరకు కడపలో మాంసం విక్రయాలు నిలిపివేస్తామని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో తహసీల్దార్​ అనుమతి పొందిన తోపుడుబండ్ల వారు మాత్రమే నిత్యావసర వస్తువులు విక్రయించాలని ఆదేశించారు.

కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా టాస్క్​ఫోర్స్​ కమిటీ సమావేశం

కడపను కరోనా రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని... ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు. కడప మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి టాస్క్​ఫోర్స్​ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 8 నుంచి 17వరకు నగరంలో మాంసం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు.

కంటైన్మెంట్ జోన్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు అంజాద్ బాషా తెలిపారు. ఈ జోన్లలోని వారు ఎవరు బయటకు వెళ్లకూడదని చెప్పారు. నిత్యావసర సరకులు మొబైల్ వాహనాల ద్వారా సరఫరా చేస్తామన్నారు. కంటైన్మెంట్ జోన్లలో స్థానిక తహసీల్దార్​ అనుమతి పొందిన తోపుడుబండ్ల వారు మాత్రమే కూరగాయలు, నిత్యావసర వస్తువులు విక్రయించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: కడప జిల్లాలో మరింత పటిష్టంగా లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.