కొవిడ్ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్లాస్మా దానం చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సూచించారు. కడప రిమ్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరఫీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఆయనే తొలి ప్లాస్మా దానం చేశారు. నెలరోజుల కిందట ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు. కొవిడ్ నుంచి కోలుకోవడంతో రిమ్స్ థెరఫీ కేంద్రంలో ప్లాస్మా దానం చేశారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని... పాజిటివ్ వచ్చిన వారెవ్వరూ భయపడవద్దని ఆయన సూచించారు. జిల్లాలో పాజిటివ్ రోగులకు అందుతున్న వైద్యంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండీ... మూడు రాజధానులు తప్పు లేదు.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్