కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ముందుకు రావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు. ఎర్రముక్కపల్లి పరిసర ప్రాంతంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చారు. దీనిని ప్రారంభించిన డిప్యూటీ సీఎం...కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రైవేటు ఆస్పత్రులు బాసటగా నిలవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలన్నూ కరోనా పేషెంట్లకు వైద్యం అందించాలని సూచించారు.
ఇదీ చదవండి