ETV Bharat / state

నివర్ వరదలు... మునిగిన పంటలు - కడప జిల్లాలో నివర్ తుపాను

నివర్ తుఫాను కారణంగా కడప జిల్లాలో శనగ పంట తుడిచిపెట్టుకు పోయింది. లక్ష ఎకరాలకు పైగా నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నీట మునిగిన పంట ఏమాత్రం పనికి రాదని మళ్లీ కొత్తగా వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

crop damage at kadapa district
మునిగిన పంటలు
author img

By

Published : Dec 3, 2020, 12:57 PM IST

కడప జిల్లాలో రబీ సీజన్​లో శనగ పంటను అత్యధికంగా సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లాలో 1.30 లక్షల హెక్టార్లలో పంట సాగైనట్లు లెక్కలున్నాయి.పెద్దముడియం, రాజుపాలెం, జమ్మలమడుగు, ముద్దనూరు, కమలాపురం, వేంపల్లి , ఎర్రగుంట్ల, పులివెందుల, పొద్దుటూరులో వివిధ పంటలు వేస్తారు. శనగ, కంది, మినుము, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో వచ్చిన తుపాను.. రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది.

ఏకధాటిగా 40 గంటల పాటు కురిసిన జడివానతో పంటలన్నీ నీట మునిగాయి. జిల్లావ్యాప్తంగా 1.20 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని అధికారులు లెక్కగట్టారు. పెద్దముడియం మండలంలో సుమారు 9వేల హెక్టార్లలో శనగ సాగులో ఉంది. వరద కారణంగా మొక్కలు నీటిలో ఉండడంతో అవి కుళ్లిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:

మంత్రి కొడాలి నాని ఇంట్లో భద్రత కట్టుదిట్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.