కడప జిల్లా జమ్మలమడుగులో 7 గురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ కే.కృష్ణన్ మాట్లాడుతూ..క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 7గురిని పక్కా ప్రణాళికతో పట్టుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్ తరలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.
ఇవీ చూడండి : ఈ ముఠా రాష్టానికి పరిమితం కాదు..దేశవ్యాప్తం!