కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని టిడ్కో ఇళ్లలోకి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని సీపీఐ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు టిడ్కో గృహాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు . గత ప్రభుత్వ హాయాంలో నిరుపేదల కోసం నిర్మించిన 1415 గృహాల్లో ... 1100 ఇళ్లకు లబ్ధిదారులు అడ్వాన్సులు కూడా చెల్లించారని సీపీఐ నాయకులు చెప్పారు . అయినప్పటికి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లను అందించక పోవటం అన్యాయం అని అన్నారు. ఈ క్రమంలో టిడ్కో ఇళ్లలోకి ప్రవేశించేందుకు సీపీఐ నాయకులు ప్రయత్నించగా... సుమారు పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. త్వరగా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
ఇదీ చదవండీ...టిడ్కో ఇళ్లలో వందల కోట్లు దోచుకున్నారు: మంత్రి బొత్స