ETV Bharat / state

తుపాను బాధితులను ఆదుకోవడంలో.. అధికారుల నిర్లక్ష్యం: సీపీఐ - సీపీఐ

CPI leaders on Mandous Cyclone: మాండౌస్‌ తుపాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య మండిపడ్డారు. అధికారులందరూ వారి వారి బంగ్లాలకే పరిమితమయ్యారంటూ కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. గతేడాది అన్నమయ్య ప్రాజెక్టు వరద ప్రవాహములో తెగిపోతే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఈశ్వరయ్య ఆరోపించారు.

CPI leaders
వైఎస్ఆర్ కడప జిల్లా సీపీఐ నేతలు
author img

By

Published : Dec 11, 2022, 3:56 PM IST

CPI leaders on Mandous Cyclone in YSR Kadapa district: మాండౌస్ తుపాను బాధితులను ఆదుకోవడంలో వైఎస్ఆర్ కడప జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య మండిపడ్డారు. జిల్లా కలెక్టర్​తో పాటుగా... అధికారులందరూ వారి వారి బంగ్లాలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. మాండౌస్ తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలమైన అధికారుల తీరును నిరసిస్తూ కడప కలెక్టర్ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మాండౌస్ తుపాను వల్ల జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుంటే అధికారులు ఏ ఒక్క ప్రాంతానికి వెళ్లకుండా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని ఆరోపించారు. గతేడాది అన్నమయ్య ప్రాజెక్టు వరద ప్రవాహములో తెగిపోతే జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కడప పర్యటన నిమిత్తం వచ్చి కలెక్టర్​కు ఫోన్ చేస్తే.. కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఫోన్ చేస్తేనే తప్ప అధికారులు స్పందించరా అని ఎద్దేవా చేశారు.

కడప కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ ఆందోళన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.