కడప జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా 250 పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం జమ్మలమడుగు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో సంజీవని బస్సు ఏర్పాటు చేశారు. పలువురు నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా 63 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు డాక్టర్ సుజాత తెలిపారు. వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ అత్యవసర సమయాల్లో తప్ప బయటకు వెళ్లకూడదని ఆమె హెచ్చరించారు. వైరస్ కట్టడి కోసం జమ్మలమడుగులో ఆంక్షలు అమలులో ఉన్నాయన్నారు.
జమ్మలమడుగులో కరోనా పరీక్షలు... 63 మందికి పాజిటివ్ - జమ్మలమడుగు కరోనా వార్తలు
జమ్మలమడుగులో కొవిడ్-19 పరీక్ష కోసం సంజీవని బస్సు ఏర్పాటు చేశారు. కరోనా పరీక్షల్లో 63మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయింది.