కడప జిల్లా ప్రొద్దుటూరుపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో అత్యధికంగా ప్రొద్దుటూరులోనే కరోనా బాధితులు ఉండటం కలవర పెడుతోంది. తాజాగా మరో మూడు కేసులు నమోదుకాగా... అందులో హెడ్‌కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ సోకినట్లు అధికారులు నిర్ధరించారు. దీంతో మొత్తంగా కేసుల నమోదు సంఖ్య 25కు చేరగా.. అందులో పది మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా సోకడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే వైరస్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించిన పోలీసులు... లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నా కంటికి కనిపించని కరోనా వణుకు పుట్టిస్తోంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు