కడప కేంద్ర కారాగారంలో కరోనా కలకలం రేపింది. రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. విషయం తెలుసుకున్న కేంద్ర కారాగారం అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. రెండు రోజుల కిందట కడప రెండవ పట్టణ పోలీసులు కర్నూలు జిల్లాకు చెందిన ఓ దొంగను అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని 14 రోజుల రిమాండ్ కోసం కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే జైలుకు వచ్చినప్పటి నుంచి జ్వరంతో ఉన్న అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వెంటనే అతన్ని జిల్లా కోవిడ్ ఆసుపత్రికి ప్రత్యేక బందోబస్తుతో తరలించారు.
కడప సెంట్రల్ జైలులో కరోనా కలకలం
కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా కడప సెంట్రల్ జైలులోని ఓ రిమాండ్ ఖైదీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్రమత్తమైన అధికారులు రిమాండ్ ఖైదీని కోవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కడప కేంద్ర కారాగారంలో కరోనా కలకలం రేపింది. రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. విషయం తెలుసుకున్న కేంద్ర కారాగారం అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. రెండు రోజుల కిందట కడప రెండవ పట్టణ పోలీసులు కర్నూలు జిల్లాకు చెందిన ఓ దొంగను అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని 14 రోజుల రిమాండ్ కోసం కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే జైలుకు వచ్చినప్పటి నుంచి జ్వరంతో ఉన్న అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వెంటనే అతన్ని జిల్లా కోవిడ్ ఆసుపత్రికి ప్రత్యేక బందోబస్తుతో తరలించారు.
ఇదీ చూడండి: మాస్కు లేదని విమానం నుంచి దింపేసిన సిబ్బంది