నవాబ్‌పేట గ్రామంలో 323 కుటుంబాలున్నాయి. మొత్తం జనాభా 1,267. పాడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఎక్కువ. ఇక్కడ 1,450 గేదెలు ఉన్నట్లు అంచనా. రోజుకు సుమారు 500 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గ్రామంలో గత నెల 28న కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 63 కేసులు వెలుగుచూశాయి. దాంతో 176 మందిని ప్రొద్దుటూరు క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో 37 పూర్తి కుటుంబాలు ఉన్నాయి.
పాడిరైతుల కుటుంబ సభ్యులంతా వెళ్లిపోవడంతో పశువులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నాయి. గ్రాసం వేసే వారు లేరు. నీళ్లు పోసేవారు లేరు. కుటుంబంలో ఒక్కరినైనా క్వారంటైన్ నుంచి ఇంటికి పంపాలని అధికారులను రైతులు అడిగినా వారు ఒప్పుకోలేదు. తమ ఇళ్ల చుట్టుపక్కల వారికి ఫోన్లు చేసి పశువుల్ని చూసుకోవాలని పలువురు దీనంగా బతిమాలుతున్నారు.