ETV Bharat / state

రైల్వేకోడూరులో మరో నాలుగు కరోనా కేసులు - రైల్వేకోడూరులో కరోనా కేసులు

కడప జిల్లా రైల్వేకోడూరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం మరో నలుగురికి కరోనా నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. వారితో కాంటాక్టు ఉన్న వారిని క్వారంటైన్​కు తరలించారు.

రైల్వేకోడూరులో మరో నాలుగు కరోనా కేసులు !

author img

By

Published : Jul 6, 2020, 10:14 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరులో నలుగురు వ్యక్తులకు కరోనా నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఓ దినపత్రికలో పనిచేస్తున్న పాత్రికేయుడితో పాటు.. రెడ్డివారిపల్లి, ఊర్లగట్టుపొడు, సియ్యవరంకమ్మపల్లిలో ఒక్కోకేసు చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వారితో ప్రైమరీ కాంటాక్టు ఉన్న వ్యక్తులను ఆదివారం 11 మందిని, సోమవారం 21 మందిని కడప క్వారంటైన్​కు తరలించినట్లు తెలిపారు.

ఈనెల 3న రైల్వేకోడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న 19 మంది పోలీసు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారందరికీ నెగిటివ్ నివేదిక వచ్చినట్లు సీఐ ఆనందరావు తెలిపారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.