ETV Bharat / state

నూతన ఇసుక పాలసీపై భవన నిర్మాణ కార్మికుల నిరసన - నూతన ఇసుక పాలసీపై కడప నిర్మాణ కార్మికుల నిరసన

ఇసుక పాలసీపై భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. కడప సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. నిరసనకు దిగారు. పనుల కొరతతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ధరకు ఇసుక అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

construction workers protest
భవన నిర్మాణ కార్మిక సంఘం ధర్నా
author img

By

Published : Oct 28, 2020, 5:12 PM IST

నూతన ఇసుక పాలసీ పేరుతో ప్రభుత్వం దోబూచులాడుతోందంటూ.. కడపలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అందుబాటులో లేక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

రాజంపేటలో దొరికే ఇసుకను కడపకు తరలించి.. తిరిగి రాజంపేటకు సరఫరా చేయడం దారుణమని కార్మికులు వాపోయారు. 10 వేల రూపాయలకు వచ్చే ఇసుక కోసం 21 వేలు వెచ్చించాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. అధిక ధరల కారణంగా.. గృహ యజమానులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదన్నారు. ఫలితంగా.. కార్మికులకు పనుల కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఆక్రమణలు తొలగించాలంటూ వైకాపా నాయకుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.