ETV Bharat / state

'ఎన్నికల్లో పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ​ సిద్ధంగా ఉంది'

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో భాజపాతో పాటుగా వైకాపా, తెదేపా, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. తన సొంత చిన్నమ్మ, చెల్లెలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి... రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

కడపలో కాంగ్రెస్​ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రెస్​మీట్​

author img

By

Published : Mar 9, 2020, 4:43 PM IST

వైకాపా సర్కారుపై కాంగ్రెస్​ నేత తులసిరెడ్డి విమర్శలు

కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు పార్టీ పరిశీలకులు లక్ష్మీనారాయణతో కలిసి ఆయన కడప జిల్లా ఇందిరాభవన్​లో సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భాజపాతో పాటు వైకాపా, తెదేపా, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే నినాదంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. వివేకానందరెడ్డి దారుణహత్యకు గురై ఏడాది కావస్తున్నా... కేసును చేధించలేదంటే ఏమనుకోవాలని వ్యాఖ్యానించారు. జగన్​పై నమ్మకం లేక తన చిన్నమ్మ, చెల్లెలు సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ వేశారని... ఇలాంటి ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని తులసిరెడ్డి ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

నరసరావుపేటలో నిలిచిన స్థానిక ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.