రైతులకు లబ్ధి చేకూరేలా ఎన్నో పథకాలు తెచ్చామని వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. చేతలకు పొంతన లేదని కాంగ్రెస్ వర్కింట్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించిన ఆయన... అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి వైకాపా ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి. తెడ్డు మాత్రం గడప దాటడం లేదు అన్నట్లు ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారు. అలాగే రుణమాఫీకి సంబంధించి ఇంకా 8 వేల కోట్లు రైతుల అకౌంట్లో జమ చేయలేదు. రైతు భరోసా నిధుల్లోనూ కోత విధించారు. ఇంతవరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించలేదు. వైకాపా ప్రభుత్వం మాటలు బ్రహ్మాండంగా చెప్తోంది. చేతల్లో మాత్రం ఏం చూపించడం లేదు - తులసి రెడ్డి, కాంగ్రెస్ వర్కింట్ కమిటీ ప్రెసిడెంట్
ఇదీ చదవండి