ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని రైతులకు శనగ విత్తనాలు పంపిణీ చేయలేని దుస్థితి ఉందని... ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా.. రైతు నిరాశగా మారిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ఒక్కో రైతుకు 12,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలు ఆపాలని, రుణ మాఫీ చేయాలని కోరారు.
ఇదీ చదవండి:జగన్ మోహన్ రెడ్డీ వేరే ఆలోచన చేయకండీ!