TULASI REDDY: 'క్విట్ దుష్టచతుష్టయం.. సేవ్ ఆంధ్రప్రదేశ్' అనే నినాదం పేరిట ఎన్నికల్లోకి వెళ్తున్నామని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. సొంత తల్లికి, చెల్లికి, చిన్నాన్న బిడ్డకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి సామాజిక న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. వైకాపా సామాజిక న్యాయం పేరిట బస్సు యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్సాఆర్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. భాజపాలో భా అంటే బాబు, జ అంటే జగన్, పా అంటే పవన్ అనే నినాదంతో వీరు ముందుకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలకు ఓట్లు వేస్తే భాజపాకు వేసినట్లే అని అన్నారు.
రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించినా.. మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే వాటిని తొలగిస్తామని తెలిపారు. జగన్ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: