కడప జిల్లా బి. కోడూరు మండలం పాయలకుంటలో వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామ సచివాలయం శంకుస్థాపన విషయంలో... ఆ పార్టీలో నెలకొన్న విభేదాలు భగ్గుమన్నాయి. రామకృష్ణారెడ్డి, డి.యోగానంద్రెడ్డి వర్గీయుల పరస్పరం రాళ్లు రువ్వు కోవడంతో ఎనిమిది మందికి గాయపడ్డారు. వీరిని బద్వేలు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గ్రామ సచివాలయం శంకుస్థాపన కార్యక్రమానికి అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో 'మిడతల దండు'యాత్ర!