కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీ పాలెం గ్రామానికి చెందిన పెద్ద వెంకట సుబ్బయ్య, చిన్న వెంకట సుబ్బయ్య అన్నదమ్ములు. వారి తల్లిదండ్రుల భూమి వాటాకు సంబంధించి ఇద్దరి మధ్య ఏడాదిగా గొడవ జరుగుతోంది. తల్లిదండ్రుల నుంచి ముందు జాగ్రత్తగా తమ్ముడు 60 సెంట్ల భూమి రాయించుకున్నాడని అతని అన్న అభ్యంతరం తెలిపాడు. దీనిని జీర్ణించుకోలేని పెద్ద వెంకటసుబ్బయ్య ఎలాగైనా తమ్ముడిని కడతేర్చాలనుకున్నాడు. ఈనెల 24న పొలానికి నీటి తడులు పెట్టేందుకు వెళ్లిన చిన్న వెంకటసుబ్బయ్య పై అన్న దాడి చేసి రాళ్లతో తీవ్రంగా గాయపరిచాడు.
స్పృ హ తప్పిన చిన్న సుబ్బయ్యను కుటుంబీకులు అత్యవసర చికిత్స కోసం చెన్నై కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి భార్య సుబ్బమ్మ బద్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: బద్వేలులో పెరుగుతున్న కరోనా కేసులు