ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. కడప నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి హోదాలో అధికారులతో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద పెద్ద షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు పీపీపీ పద్ధతిలో నిర్మించడానికి యోచిస్తున్నట్లు తెలిపారు. బుగ్గవంక సుందరీకరణ, విమానాశ్రయం నుంచి నగరంలోకి వచ్చే రహదారిని అందంగా తీర్చిదిద్ధడం, రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ చేయడం వంటి అంశాలను త్వరలోనే చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకు పాత మున్సిపల్ కార్యాలయం స్థలాన్ని లీజుకు ఇచ్చిన అంశంపై తీర్మానాన్ని ఆమోదించారు. జనవరి నుంచి కడప నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని అన్నారు.
ఇదీ చదవండి :