ప్రతి ఒక్క కరోనా బాధితుడికి వైద్యం అందించాలని కడప కలెక్టర్ హరికిరణ్ స్పష్టం చేశారు. ఏ ఒక్కరు నిరుత్సాహానికి గురి కావద్దని ఆయన భరోసా ఇచ్చారు. కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌తో పాటు తోటి అధికారులు పీపీఈ కిట్లు ధరించి కొవిడ్ బాధితులతో మాట్లాడారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. బాధితులకు దగ్గరుండి వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కర్నూలు: ప్రైవేటు ఆసుపత్రిలో రెండు రోజుల్లో 9 మంది మృతి!