రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో ప్రజల నుంచి నిధులను సేకరిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ నాయకులు రాఘవులు తెలిపారు. రామ మందిరం నిర్మాణం కోసం కడప ప్రజల నుంచి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలువురు వ్యాపారులు లక్షల రూపాయల చొప్పున విరాళాలను అందజేశారు. ఎంతోకాలం నుంచి కోర్టులో ఉన్న రామమందిరం నిర్మాణానికి ఎట్టకేలకు తీర్పు ఇవ్వడంతో భారత దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. 36 సంవత్సరాల నుంచి ఒక పద్ధతి ప్రకారం ఉద్యమాలు నిర్వహిస్తున్నామని, చివరికి ఉద్యమ ఫలితంగానే రామమందిరం నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్ముతో కాకుండా ప్రజల నుంచి సేకరించిన విరాళాలు ద్వారానే రామ మందిరం నిర్మిస్తున్నామని చెప్పారు.
ఇవీ చదవండి: కడప పోలీసు మైదానంలో శిక్షణా తరగతులు
రామమందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ - రామ మందిరం నిర్మాణం వార్తలు
రామ మందిరం నిర్మాణం కోసం కడప ప్రజల నుంచి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విశ్వహిందూ పరిషత్ నాయకులు రాఘవులు తెలిపారు. మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ నిధులు సేకరిస్తుమన్నారు.