cm tour in kadapa: కడప జిల్లా పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి జగన్ గురువారం ప్రొద్దుటూరు చేరుకోనున్నారు. సుమారు రూ.530 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తి చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితోపాటు జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
గురువారం ఉదయం 11:20 గంటలకు సీఎం.. ప్రొద్దుటూరుకు చేరుకుని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
వీధిరౌడీల్లా అశోక్ గజపతిరాజుపై.. మంత్రులు దాడికి తెగించారు: చంద్రబాబు