కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ కేసీ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి, సిబ్బందితో కలిసి ఆయన చర్చించారు. జూలై 7,8 తేదీల్లో సీఎం జగన్ ఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని కేసీ రెడ్డి పేర్కొన్నారు.
రూ.40కోట్లతో నిర్మించనున్న డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆడిటోరియంను ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వివిధ విభాగాల డిపార్ట్మెంట్ భవనాలు, మూడు మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌరశక్తి విద్యుత్ ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.